- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల చెరువు పై కమీషన్ల దందా..!
దిశ, మంచిర్యాల : చేపల చెరువులపై కమీషన్ల దందాలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారంతో.. చెరువు పై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని

దిశ, మంచిర్యాల : చేపల చెరువులపై కమీషన్ల దందాలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారంతో.. చెరువు పై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిని దిగమింగుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. సొసైటీలో ఉన్న సభ్యులకు ఏడాదికి ఒక్కసారి కమీషన్లు పంచి సొసైటీ కి పెద్ద వ్యక్తి గా ఉన్న సభ్యుడు ప్రైవేట్ వ్యక్తులతో రహస్య బంధాన్ని కుదుర్చుకొని రూ. లక్షలు గడిస్తున్నారు. సొసైటీ నుంచి ప్రతి ఏడాది చెరువు లీజు అమౌంట్ ను జమచేసి తీర్మానం కాపీతో సహా ప్రభుత్వానికి డబ్బును చెల్లిస్తున్నారు. కానీ ఐదేళ్ళ సమయం అయిపోయిన ఎన్నికలు జరగడం లేదు. దీంతో సొసైటీలో ఏ సమస్య ఉన్నా చెప్పే పరిస్థితి లేకుండా పోయిందని మత్స్యకార సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో చేసేదేమీ లేక మత్స్యకార కుటుంబాలు మౌనం పాటిస్తున్నాయి. ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తున్న అది కాస్త ప్రైవేట్ దళారులకు వరంలా మారింది. అంతేకాకుండా చెరువు పై పెత్తనం చెలాయించే అధ్యక్షుడు రాజకీయ నాయకులతో చేతులు కలిపి వాటాలకు అమ్ముడుపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మత్స్యకార కుటుంబాల దీన గాదపై దిశ ప్రత్యేక కథనం.
జిల్లాలో ఇది పరిస్థితి..
మత్స్యకార కుటుంబాల జీవనోపాధి కోసం ప్రభుత్వం మత్స్యకార కుటుంబాల జీవనోపాధి కోసం ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించి జీవనోపాధి కోసం ఎన్ని ప్రణాళికలు రూపొందించిన అవికాస్త దళారుల కబంద హస్తాలలో మత్స్య సంపద కాస్త ఆవిరియిపోతుంది. జిల్లా లో మొత్తం 389 చెరువులు, ప్రాజెక్టులు( పెరినియల్) ప్రాజెక్టులు 11, ఉండగా 136 మత్స్యకార సంఘాలు, ఈ సంఘాలలో 7867 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల ద్వారా ప్రతి ఏడాది ప్రభుత్వానికి రూ. 13. లక్షల 31 వేల 758 లీజు రూపేనా చెల్లిస్తున్నారు. జిల్లాలో గుర్తించబడిన చెరువులలో మత్స్యకార సంఘాలకు ప్రతి ఏడాది టెండర్ల ద్వారా ఉచిత చేప పిల్లలు చెరువుల్లో వదులుతున్నారు. జిల్లాలో ఉన్న 339 చెరువులు, 11 ప్రాజెక్టుల లో ఉచిత చాప పిల్లల పంపిణీ చేస్తుంది. ఎలాంటి లీజు లేకుండా మీరు నిలువ ఉండే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా ప్రాంత మత్స్యకార సంఘాలకు 24 లక్షల 42 వేల చెప పిల్లలను ఉచితంగా ప్రాజెక్టులు వదులుతున్నారు. అంతేకాకుండా అన్నారం, సుందర శాల బ్యారేజీల్లో 24 లక్షల 12 వేల చాప పిల్లలను పదులుతున్నారు. ఆయా ప్రాంతాల మత్స్యకార కుటుంబాలు చేపలను పట్టి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు.
విడతల వారీగా చేప పిల్లల పంపిణీ
ప్రభుత్వం జిల్లాలో టెండర్ల ద్వారా చేప పిల్లలు పంపిణీకి సిద్ధం చేసింది. జగిత్యాల జిల్లా వెంకటేశ్వరా ఫిష్ ట్రేడర్స్ ద్వారా 20 లక్షల చాప పిల్లలు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన బండారి.హాసిని ఫిషరీస్ ఫామ్ ధ్వారా చేప పిల్లలను ఈ ఏడాది జిల్లాలోని ప్రాజెక్టులలో 108.28 లక్షల 80 నుండి 100 ఎం. ఎం చేప పిల్లలు వదులుతున్నారు. జిల్లా మొత్తంగా 226.00 లక్షల చేప పిల్లలను విడతల వారీగా చెరువులు, ప్రాజెక్టులలో వదులుతున్నారు.
కమలాపురం చేపల చెరువుపై కమీషన్ల దందా...
జిల్లా లోని భీమిని మండలం లోని కమలాపురం మినీ ప్రాజెక్ట్ లో చేపలు పట్టుకునే మత్స్యకార కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. పెద్ద పేట సొసైటీ ద్వారా కమలాపూర్ ప్రాజెక్టు లో ఈ చెరువు పై 54 మంది సొసైటీ ఆక్టివిటీ లో ఉంది. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మత్స్యకార ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. కానీ పెద్ద పేట సొసైటీ గా ఎన్నికల టార్మ్ ముగిసి ఏడాది కాలం అవుతుంది. సొసైటీ కి అధ్యక్షుడిగా ఉన్న ఓ వ్యక్తి ప్రస్తుతం మూడేళ్లగా ఓ ప్రైవేటు వ్యక్తితో కమిషన్ పరంగా ఒప్పందం కుదుర్చుకొని మండలానికి చెందిన ఓ నాయకుని పలుకుబడితో చక్రం తిప్పుతున్నాడు. మూడేళ్లుగా కమలాపూర్ ప్రాజెక్టు లో చేప పిల్లలను ఈ సొసైటీ లీజు కట్టినప్పటికీ సొసైటీ సభ్యులకు సంవత్సరంలో ఒక్కసారి రూ. 3 వేల చొప్పున అందిస్తూ గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్రైవేట్ వ్యక్తితో చెరువులో చేపలు అమ్ముకుంటూ లాభాన్ని గడిస్తున్నాడు. ఆ రాజకీయ నాయకుడు చెప్పిన విధంగా సొసైటీ సభ్యులు నడుచుకోవాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి కి పెద్దపీట వేసిన మత్స్య సంపద ప్రైవేట్ వ్యక్తుల కబంధహస్తాల్లో కి వెళ్లడంతో చెరువులోని చేపలను చేరబడుతున్నారు. ప్రభుత్వం మత్స్య సంపద దళారుల చేతికి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల సొసైటీ సభ్యులు కోరుతున్నారు.






