- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలి : కలెక్టర్ కుమార్ దీపక్
దిశ, మంచిర్యాల : యువత ఆర్థిక అభివృద్ధి దిశగా ఉద్యోగ అవకాశాలు పొంది ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్ లో

దిశ, మంచిర్యాల : యువత ఆర్థిక అభివృద్ధి దిశగా ఉద్యోగ అవకాశాలు పొంది ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్ లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించారు. మెగా జాబ్ మేళా కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ వంశీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మందమరి జి.ఎం రాధాకృష్ణ, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పలువురు ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను పొంది ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు. విద్య కోర్సుల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు యువతను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం.వినోద్ మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళల లో యువతి, యువకుల కు స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా అనేక కోర్సుల్లో నైపు శిక్షణ అందిపుచ్చుకొని ఉద్యోగ అవకాశాల్లో రాణించాలని తెలిపారు. తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డంసభ్యుడు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా ను నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ప్రైవేటు రంగాల్లో శిక్షణ పొందుతూ ఉద్యోగ సాధిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని తమ నైపుణ్యాలను కనబరిచి అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు పొందేందుకు వచ్చిన యువతను అభినందించారు. మందమర్రి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ యువత పరిశ్రమల శాఖ అనుబంధంగా నిర్వహించిన జాబ్ మేళా లో సింగరేణి కాలరీస్ లో పట్టణం నుండి మారుమూల గ్రామాల యువతకు కూడా అందుబాటులో ఉండే విధంగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. అర్హులైన వారందరినీ ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.






