- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, భైంసాః ఇటీవల తానూరు మండలం బెల్ తరోడ గ్రామానికి చెందిన చిన్నారి దుర్గ తల్లి ఆత్మహత్య చేసుకుని మరణించగా.. తల్లి అంతక్రియల కోసం కూతురు దుర్గ భిక్షాటన చేసింది. దాంతో దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ కాగా..సేవా సంస్థలు, గల్లి నాయకుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు స్పందించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దుర్గను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ పట్టణంలోని దివ్య నగర్ లో గల మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో అరవతరగతిలో చేర్పించి అవసరమైన వస్తువులు కొనిచ్చారు. ఉన్నత చదువులు చదివి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిoచాలని సూచించారు. వీరివెంట ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉన్నారు.
Next Story






