- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నాణ్యతలో నిబంధనలు పాటించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ మండలంలోని నాగ్నాయిపేట గ్రామం లో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ మండలంలోని నాగ్నాయిపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భవన నమూనా మ్యాపులను పరిశీలించి, అవసరమైన సవరణలపై సూచనలు చేశారు. భవన నిర్మాణం నాణ్యతగా, సమయానికి పూర్తి కావాలని, సరిపడినంతమంది కూలీలను నియమించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రదేశం కేటాయించాలన్నారు. భవనం చుట్టూ హద్దుల గుర్తులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందిరా మహిళా శక్తి భవనాలు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతను పెంపొందించేందుకు చేపట్టిన ప్రాధాన్యమైన కార్యక్రమమనికలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో నాణ్యత పాటించాలి
అనంతరం కలెక్టర్ పట్టణంలోని బంగాల్‌పేట్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోందని, పనులను నాణ్యవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దశలవారీగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని, అధికారులు పర్యవేక్షణను క్రమం తప్పకుండా కొనసాగించాలని కలెక్టర్ అన్నారు. నిరుపేద లబ్ధిదారుల తమ సొంత ఇంటి కలను నెరవేర్చినందుకు ప్రభుత్వానికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.






