ఆదిలాబాద్ ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన కేసు..

by Disha Web Desk 23 |
ఆదిలాబాద్ ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన కేసు..
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ పై శుక్రవారం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయింది. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. కాగా శ్రీరామనవమి సందర్భంగా రాముని ఫోటోల పక్కన ఎమ్మెల్యే ఫోటోలను ఏర్పాటు చేయగా, ఇది ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోకపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షాకు ఫిర్యాదు చేశారు.

దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు.

Next Story

Most Viewed