ఏప్రిల్ 06న బాస‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

ఏప్రిల్ 06న బాస‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నార‌ని ఎమ్మెల్యే ప‌వార్ రామ‌రావ్ పటేల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఏప్రిల్ 06న బాస‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, భైంసా: ఏప్రిల్ 06న బాస‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నార‌ని ఎమ్మెల్యే ప‌వార్ రామ‌రావ్ పటేల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బాస‌ర‌లో మాస్ట‌ర్ ప్లాన్ అమ‌లు చేయ‌డంతో పాటు ఆల‌య పున:నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు. అలాగే ముధోల్ లో రూ.200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని బాసరలోనే చేపడతారని, గత ప్రభుత్వ హ‌యాంలో నిధులు మంజూరై అప్పటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆలయ పునర్నిర్మాణానికి నోచుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. పలుమార్లు ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం, ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగిందని, బాసరకు ముఖ్యమంత్రి రావడం శుభ పరిణామన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story