గ్రామస్తులకు- పోలీసులకు మధ్య ఘర్షణ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ‌ మండలంలోనీ చిన్న బుగ్గారం గ్రామంలో పోలీసులకు- గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగిన సం

గ్రామస్తులకు- పోలీసులకు మధ్య ఘర్షణ
X

దిశ‌, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ‌ మండలంలోనీ చిన్న బుగ్గారం గ్రామంలో పోలీసులకు- గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగిన సంఘటన చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నికలలో నిలబడి ఓడిపోవడంతో నాకు ఓటు వేయలేరని అక్కసుతో గ్రామంలోని వ్యక్తి రోడ్డు పై నుండి ఎవరు వెళ్లకుండా రోడ్డుపై ఏండ్ల బండి పెట్టడంతో పోలీసులకు సమాచారం అందించ‌డంతో సిబ్బందితో ఎస్ఐ ఇమ్రాన్ ఖాన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సర్పంచ్ కు నిలబడిన వ్యక్తి రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లు నిలుచుండబెట్టగా ఎవరికి వెళ్లడానికి దారి లేకపోవడంతో ఎస్సై ఇమ్రాన్ వాటిని అడ్డు తొలగించడానికి ప్రయత్నించాడు. అలా ప్రయత్నించగా సర్పంచ్ కి నిలబడిన వ్యక్తి కుమారుడు మీరు దారికి అడ్డంగా పెట్టిన ఎడ్లబండ్లను తొలగించినట్లయితే నేను మందు తాగి చనిపోతాన‌ని బెదిరించాడు. నువ్వు మందు తాగి ఎలా చ‌స్తావు అని ఎస్సై ఇమ్రాన్ అత‌న్ని అక్క‌డి నుంచి తీసుకెళ్తుండ‌గా.. గ్రామ‌స్తులు ఒక్క‌సారిగా పోలీస్ సిబ్బంది పై తిర‌గ‌బ‌డ్డారు. దీంతో గ్రామ‌స్తుల‌కు-పోలీసుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కానిస్టేబుల్ కి గాయాల‌య్యాయ‌ని, అంతేకాకుండా గాయాలైన కానిస్టేబుల్ ను బోథ్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లార‌ని స్థానికులు తెలిపారు. గ్రామ‌స్తులు-పోలీసుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌రువాత ఆదిలాబాద్ ఎస్పీ వ‌ద్ద‌కు వెళ్లిన్టు స‌మాచారం.

Next Story