సీపీఆర్ పై త‌ప్ప‌క‌ అవగాహన కలిగి ఉండాలి : సీఐ శ్రవణ్ కుమార్

by Ratna Kumari |

దిశ, బేల : సీపీఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బేల సీఐ శ్రవణ్ కుమార్ మెడికల్ ఆఫీసర్ వంశీ కృష్ణ అన్నారు. బుధవారం బేల పోలీస్ స్టేషన్ లో రోడ్డు భద్రతలో భాగంగా సీపీఆర్ పై

సీపీఆర్ పై త‌ప్ప‌క‌  అవగాహన కలిగి ఉండాలి : సీఐ శ్రవణ్ కుమార్
X

దిశ, బేల : సీపీఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బేల సీఐ శ్రవణ్ కుమార్ మెడికల్ ఆఫీసర్ వంశీ కృష్ణ అన్నారు. బుధవారం బేల పోలీస్ స్టేషన్ లో రోడ్డు భద్రతలో భాగంగా సీపీఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రోడ్డు భద్రతలో భాగంగా పలువురికి ప్రథమ చికిత్స బాక్స్ లను అందజేశారు. ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు వల్ల‌ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, నివారణ చేయాలంటే సీపీఆర్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలని సూచించారు. సీపీఆర్ వ‌ల్ల వారిని ఆకస్మిక గుండెపోటు నుంచి కాపాడే ప్రయత్నం చేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మెలకువలు తెలుసుకోవాలని సూచించారు.

Next Story