ఆఖరి మజిలీకి అవస్థలు ఎన్నో.. పట్టణ ప్రజల చిరకాల వాంఛకు మోక్షం ఎప్పుడో..?

by Bhanu |

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వైకుంఠధామం లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.

ఆఖరి మజిలీకి అవస్థలు ఎన్నో.. పట్టణ ప్రజల చిరకాల వాంఛకు మోక్షం ఎప్పుడో..?
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వైకుంఠధామం లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టణంలో ఎవరైనా మరణిస్తే అంతిమ సంస్కారాలకు పట్టణంలో గోదావరిలో కర్మ కాండలు నిర్వహిస్తారు. పట్టణానికి గోదావరి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అందులో ముఖ్యంగా అందులో కిలోమీటర్ నర మేరకు ఇసుకతో నిండి ఉండడంతో ఇసుకలో నడుస్తూ గోదావరి ఒడ్డు వరకు చేరుకొని చనిపోయిన వ్యక్తి యొక్క అంతిమ సంస్కారాలు నిర్వహించాలంటే నానా అవస్థలు పడుతూ లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా వేసేవి కాలంలో గోదావరిలో నీరు అవతలి ఒడ్డు వరకు ఉండటంతో ఇసుకలో నడవడం ఇబ్బందికరంగా మారడంతో చాలామంది అంతిమ సంస్కారాలకు హాజరు కాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన వైకుంఠ ధామం నిర్మించకపోవడంతో ప్రజలు నాయకులపై చివాట్లు పెడుతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో వైకుంఠధామాన్ని పట్టించుకోలేదని, ఎన్నికల ముందు తూతూ మంత్రంగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వైకుంఠ దామం త్వరలోనే నిర్మాణ పనులు కొనసాగుతాయని అప్పటి నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలం గడిపినారు. కనీసం కాంగ్రెస్ పాలనలోనైనా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకొని వైకుంఠధామని నిర్మించి ప్రజల కష్టాలను తీర్చాలని ప్రజలకు కోరుతున్నారు.



Next Story