చెక్ పోస్ట్ వ‌ద్ద త‌నిఖీలు.. రూ.28 ల‌క్ష‌ల న‌గ‌దు సీజ్

by Ratna Kumari |

ఆదిలాబాద్ జిల్లాలోని రాంపూర్ ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నీఖీల్లో రూ.28ల‌క్ష‌ల న‌గ‌దును సీజ్ చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బుధ‌వారం త‌నిఖీలు నిర్వ‌హించారు.

చెక్ పోస్ట్ వ‌ద్ద త‌నిఖీలు.. రూ.28 ల‌క్ష‌ల న‌గ‌దు సీజ్
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని రాంపూర్ ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ వ‌ద్ద పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నీఖీల్లో రూ.28ల‌క్ష‌ల న‌గ‌దును సీజ్ చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బుధ‌వారం త‌నిఖీలు నిర్వ‌హించారు. మహారాష్ట్ర బస్సులో వస్తున్న మహారాష్ట్ర ఉమార్కేడ్, ధానికి గ్రామానికి చెందిన సుభాష్ కేశవ్ జన్నావార్ అనే వ్యక్తి సరైన ధృవ పత్రాలు లేకుండా రూ.28 లక్షల నగదు తీసుకెళ్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటలు అప్రమత్తమై తనిఖీలను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. త‌నీఖీల్లో డిప్యూటీ తహశీల్దార్ భూష మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story