ఆసిఫాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో గందరగోళం

by Taduka Kalyani |

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన తొలి బడ్జెట్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. స్టేజిపై వైస్ చైర్మన్‌కు కుర్చీ ఏర్పాటు చేయడంపై అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆసిఫాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో గందరగోళం
X

దిశ, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన తొలి బడ్జెట్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. స్టేజిపై వైస్ చైర్మన్‌కు కుర్చీ ఏర్పాటు చేయడంపై అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం వైస్ చైర్మన్‌ను సభ్యులతో కలిసి కూర్చోబెట్టాలని, స్టేజిపై ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేయకూడదని కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో సమావేశంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. అనంతరం మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలిని నిరసిస్తూ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్టేజిపై వైస్ చైర్మన్‌కు కుర్చీ వేయవద్దని, ఫోటో కాల్ నిర్వహించాలని గతంలోనే రాతపూర్వకంగా కమిషనర్‌ను కోరామని తెలిపారు. అయినప్పటికీ కమిషనర్ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. చైర్మన్ పక్కన వైస్ చైర్మన్‌కు కుర్చీ ఏర్పాటు చేయడం ఎక్కడా లేని విధంగా ఉందని, అధికార పార్టీ కౌన్సిలర్లకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వారు జిల్లా కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేశారు.

Next Story