ఒకటి కాదు.. 39 మంది రైతులను ముంచిన మోసగాడు...చివరికి రిమాండ్!

by Bhanu |

రైతులకు మోసం చేసి పంట డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన సీ.ఈ.వో శ్రీనివాస్ ను పట్టుకున్నట్టు ఏ.ఎస్.పి అవినాష్ కుమార్ వెల్లడించారు.

ఒకటి కాదు.. 39 మంది రైతులను ముంచిన మోసగాడు...చివరికి రిమాండ్!
X

దిశ, భైంసా : రైతులకు మోసం చేసి పంట డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన సీ.ఈ.వో శ్రీనివాస్ ను పట్టుకున్నట్టు ఏ.ఎస్.పి అవినాష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం బైంసా పట్టణ ఏ.ఎస్.పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఏ.ఎస్.పి అవినాష్ కుమార్ వివరాలు వెల్లడించారు..కుభీర్ మండలంలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులతో ఉడాయించి మోసం చేసిన మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈవో శ్రీనివాస్ ను ఎట్టకేలకు అరెస్టు చేశామన్నారు.


దాదాపు 39 మంది రైతులకు చెందిన రూ.54లక్షల మేర ఇవ్వకుండా పరారు కాగా, కుబీర్ లోకేశ్వరం మండలాల పోలీస్ స్టేషన్లో రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 3 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి, శ్రీనివాస్ ను పార్డి (బి) గ్రామం వద్ద పట్టుకుని దాదాపు రూ. 9లక్షలు రికవరి చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన వారు..! అమౌంట్ ని ఎక్కడెక్కడ వాడరో..! పూర్తి సమాచారం తదుపరి ఇన్వెస్టీగేషన్లో తెలుస్తుందని తెలిపారు.

Next Story