- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉంది : Nitin Gadkari
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి

దిశ, కాగజ్నగర్ రూరల్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రూ. 3,900 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ రహదారుల ప్రాజెక్టులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి,ఎమ్మెల్యే హరీష్ బాబు తదితరులు హాజరయ్యారు.
ప్రధానంగా ప్రారంభించిన ప్రాజెక్టులు: మంచిర్యాల నుండి వాంకిడి (మహారాష్ట్ర సరిహద్దు వరకు) NH-363 ఫోర్ లైన్ రోడ్డు నిర్మల్-ఖానాపూర్ NH-61 రెండు వరుసల రహదారి నాగపూర్-హైదరాబాద్ NH-44లో అండర్‌పాస్‌లు, జంక్షన్‌లు.
గడ్కరీ మాట్లాడుతూ, "తెలంగాణ అభివృద్ధిలో జల సంరక్షణ కీలకమైంది. ఇంటి నీళ్లు ఇంటిలోనే, పొలం నీళ్లు పొలంలోనే నిల్వ చేసుకునే విధంగా సీఎం ప్రణాళికలు రూపొందించాలి" అని సూచించారు. పేదలకు వసతి, ఆహారం, వస్త్రాలు అందించడమే నిజమైన రాజకీయమని అభిప్రాయపడ్డారు.దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేగె ప్రభుత్వం చీకటి ప్రాంతాలకు వెలుగు చిమ్ముతోందని చెప్పారు. రైతుల అభివృద్ధిని కేంద్ర బిందువుగా తీసుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గడ్కరీ హామీలు – భవిష్యత్తు అభివృద్ధి
రాబోయే 3 సంవత్సరాల్లో రూ. 2 లక్షల కోట్లతో తెలంగాణలో రహదారుల అభివృద్ధి,రాష్ట్ర వ్యాప్తంగా మరో లక్ష కోట్లతో గ్రీన్ హైవేలు,మేడారం రహదారి విస్తరణ,నాగపూర్-హైదరాబాద్ మార్గాన్ని ఆరు వరుసల జాతీయ రహదారిగా విస్తరింపు,శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు రహదారి కలను నిజం చేయనున్నాం.
వ్యక్తిగత అనుభవాలను వెల్లడి
"నాకు 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నేను డ్రోన్ తో ఎరువులు పిచికారీ చేస్తున్నాను," అని తన అనుభవాన్ని పంచుకున్నారు. గడ్చిరోలి జిల్లా పరిసర ప్రాంతాల సమస్యలపై తనకు అవగాహన ఉందని, తెలంగాణలో పేదరిక నిర్మూలన తన ఆకాంక్ష అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు గూడెం నాగేష్, గడ్డం వంశీ, ఎమ్మెల్సీ దండే విట్టల్, కలెక్టర్ వెంకటేష్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
- Tags
- nitin gadkari






