మావోయిస్టుల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వ పున‌రాలోచించాలి : సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు క‌ల‌వేని శంక‌ర్

by Ratna Kumari |   (  Updated:2025-11-30 12:31:57  IST  )

దిశ, మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పట్ల పునరాలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు

మావోయిస్టుల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వ పున‌రాలోచించాలి : సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యుడు క‌ల‌వేని శంక‌ర్
X

దిశ, మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పట్ల పునరాలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కారుకూరి నాగేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పట్ల పునరాలోచించాలని పేర్కొన్నారు. శాంతి చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందిన ఘటనను బూటకపు ఎన్కౌంటర్ గా అభివర్ణించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మెజారిటీ ప్రజల ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని కోరారు. జిల్లాలో పోటీ చేస్తున్న సీపీఐ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే డిసెంబర్ 26న రామకృష్ణాపూర్‌లో నిర్వహించే వంద సంవత్సరాల శత జయంతి ముగింపు బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, మిట్టపల్లి వెంకటస్వామి, చిప్ప నర్సయ్య, బొల్లం పూర్ణిమ, రేగుంట. చంద్రశేఖర్, రేగుంట చంద్రకళ, జోగుల మల్లయ్య, ఇప్పకయల లింగయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, దుర్గారాజ్, ఆడెపు రాజమోగిలి, కొండు బాణేష్, దేవి పోచన్న, ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story