- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాల్య వివాహంలో పాల్గొన్న వారందరిపై కేసులు నమోదు చేయాలి : కలెక్టర్ రాజర్షి షా
దిశ, ఆదిలాబాద్ : బాల్య వివాహంలో పాల్గొన్న వారందరిపై కేసులు నమోదు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్

దిశ, ఆదిలాబాద్ : బాల్య వివాహంలో పాల్గొన్న వారందరిపై కేసులు నమోదు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, ష్యూర్ ఎన్జీవో సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తే వారి భవిష్యత్తు తో పాటు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం పాడవుతుందని, బాల్య వివాహాల నిర్మూలనపై ముహూర్తాల సమయంలో, ఆయా పూజ కార్యక్రమాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, జిల్లా సంక్షేమ అధికారి కె మిల్కా, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకట్ స్వామి, సభ్యులు సమీర్ ఉల్ల ఖాన్, దశరథ్, డేవిడ్, ష్యూర్ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, అర్చక సంఘం సభ్యులు, చర్చి పాస్టర్లు, మౌలానా ఖాజీ లు, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, డీసీపీయూ, ఐసీపీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.






