మరో వివాదంలో ఎంపీ సోయం బాపూరావు.. పీఏ పై కేసు నమోదు

by Malleboina Mahesh |   (  Updated:2023-06-21 07:07:42  IST  )

ఎంపీ సోయం బాబూరావు తన వివాదంలోనే సతమతమవుతున్న తరుణంలో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పిఏ చేసిన నిర్వాకం వల్ల ఎంపీ బాపూరావుకు చెడ్డ పేరు వచ్చేలా మారుతుంది.

మరో వివాదంలో ఎంపీ సోయం బాపూరావు.. పీఏ పై కేసు నమోదు
X

దిశ, ప్రతినిధి నిర్మల్: ఎంపీ సోయం బాబూరావు తన వివాదంలోనే సతమతమవుతున్న తరుణంలో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పిఏ చేసిన నిర్వాకం వల్ల ఎంపీ బాపూరావుకు చెడ్డ పేరు వచ్చేలా మారుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టి సావర్గంలో భూ వివాదంలో ఎంపీ వ్యక్తిగత సహాయకుడు నగేష్ ఆయన సోదరుడు సురేష్ ఇద్దరు తనపై దాడి చేశారంటూ రాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎంపీ బాపురావు పీఎ నగేష్ సోదరుడు సురేష్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారం ఎంపీ సోయం బాపూరావు తలనొప్పిగా మారుతోంది.

Also Read..

ఎన్నికల ముందు కాషాయ పార్టీలో భారీ కుదుపు

Next Story