- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గజదొంగ అరెస్ట్
వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ గజదొంగను అరెస్టు చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

దిశ, ఆదిలాబాద్ రూరల్ : వరస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ గజదొంగను అరెస్టు చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరసగా ఏడు దొంగతనాలు జరిగిన ఘటనలో అదే మండలానికి చెందిన టేకం రామారావును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నిందితుడిపై మొత్తం 36 కేసులు నమోదై ఉండగా, కరీంనగర్, సిద్దిపేట్ ప్రాంతాల్లో దొంగతనాలు చేసినందుకు గతంలో రెండు సంవత్సరాల జైలు శిక్ష సైతం అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. తిరిగి ఉట్నూర్ మండలంలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలయిన వెంటనే మంచిర్యాలలో స్కూటీ దొంగతనం చేసి ఉట్నూరుకు వచ్చి, ఊరు శివారులో పాడుబడ్డ ఇళ్లలో, నిర్మాణం జరుగుతున్న ఇళ్లలో నివాసం ఉంటూ, రాత్రి సమయాలలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడు దొంగిలించిన బంగారం, వెండి సామాగ్రితో మంచిర్యాల వైపు పారిపోతుండగా.. కొత్తగూడ ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండి నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుడి నుంచి మొత్తం 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, ఎస్సై గుంపుల విజయ్ మరియు పోలీస్ సిబ్బంది ఆర్ శ్యామ్ రావు, బి నరేష్, ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.






