- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి
మండలంలోని మెట్టుపల్లిలో హనుమాన్ టెంపుల్ దగ్గర విద్యుత్ నియంత్రిక కు తగిలి ఎద్దు మృతి చెందింది.

దిశ, కన్నెపల్లి : మండలంలోని మెట్టుపల్లిలో హనుమాన్ టెంపుల్ దగ్గర విద్యుత్ నియంత్రిక కు తగిలి ఎద్దు మృతి చెందింది. వివరాల్లోకెళ్తే మెట్టుపల్లి కి చెందిన సీడం గంగారం చెందిన సుమారు యాభై వేల రూపాయలు విలువ చేసే ఎద్దు మేత కోసం వెళ్లిన సమయంలో మరో ఎద్దుతో పొట్లాడడంతో పక్కనే ఉన్న విద్యుత్ నియంత్రికకు తగలడంతో ఎద్దుకు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింనది. మెట్టుపల్లి లోని ప్రజలకు గృహాలకు విద్యుత్ సరఫరా కోసం రెండు విద్యుత్ నియంత్రికలు ఒకే చోట పక్క పక్కన రెండు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి రక్షణగా కంచెను వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా చేసి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్న విద్యుత్ నియంత్రికల వద్ద రక్షణగా కంచెలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






