మా గ్రామానికి రోడ్డు వేయండి..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-02 10:55:58  IST  )

దిశ‌, ఉట్నూర్ : ఉట్నూర్ మండలంలోని రాజులమడగు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉట్నూర్ మండల కేంద్రానికి వచ్చే రోడ్డు బురద మయం,

మా గ్రామానికి రోడ్డు వేయండి..!
X

దిశ‌, ఉట్నూర్ : ఉట్నూర్ మండలంలోని రాజులమడగు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉట్నూర్ మండల కేంద్రానికి వచ్చే రోడ్డు బురద మయం, పెద్ద పెద్ద గుంతలతో అస్తవ్యస్తంగా తయారైంది. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలనీ ఐటీడీఏ అధికారులకు విన్నవించిన పట్టించుకోలేదనీ వాపోతున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో బాధలు వర్ణనాతీతమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి గ్రామానికి సరైన రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

Next Story