బీసీ రిజర్వేషన్ కు కాంగ్రెస్, బీజేపే వ్యతిరేకం : బీఎస్పీ రాష్ట్ర‌ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు వ్యతిరేకమని.. 43 ఏళ్లుగా బీసీలకు రిజర్వేషన్ లు అమలు కాకుండా అడ్డుకున్నారని బీఎస్పీ రాష్ట్ర‌ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్ కు కాంగ్రెస్, బీజేపే వ్యతిరేకం : బీఎస్పీ రాష్ట్ర‌  కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం
X

దిశ, ఆసిఫాబాద్ : బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు వ్యతిరేకమని.. 43 ఏళ్లుగా బీసీలకు రిజర్వేషన్ లు అమలు కాకుండా అడ్డుకున్నారని బీఎస్పీ రాష్ట్ర‌ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లంబిని దీక్షభూమిలో ఏర్పాట్లు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీఎస్పీతోనే మండల్ కమిషన్ లో 27% రిజర్వేషన్ లు అమలు అయిందని గుర్తు చేశారు.బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల బహుజను లకు రాజ్యాంగం ద్వారా హక్కులు లభించాయి. కానీ రాష్ట్రంలో 56 శాతం బీసీ ల జనాభా ఉందని చెప్పి. 42 శాతం రిజర్వేషన్ లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..బీసీ రిజర్వేషన్ ల పట్ల చిత్త శుద్ధి లేదన్నారు . నాడు బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరామ్ పోరాటం పోరాటం వలన మండల్ కమిషన్ అమలు అయిందన్నారు. మండల్ కమిషన్ రిజర్వేషన్ లను అడ్డుకోవడానికి బీజేపీ ఏబీవీపీ విద్యార్థులకు నిప్పు పెట్టి బీసీ రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన చేసిందని గుర్తు చేశారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ లు కల్పించాలని. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని. బీసీలకు స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ని ఓడించక పోతే రాజ్యాంగం ను రద్దు చేస్తారని. రాజ్యాంగం రద్దు అయితే సమాజంలో 92 శాతం ప్రజలు సర్వ హక్కులు కోల్పోయి శాశ్వత బానిసలూ గా మరే అవకాశం ఉందన్నారు. బీఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

Next Story