- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
by Bhanu |
మండలంలోని బాబెర గ్రామానికి చెందిన ఆత్రం దశరథ్ అనే వ్యక్తి బుధవారం ఉదయం పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

X
దిశ, బోథ్: మండలంలోని బాబెర గ్రామానికి చెందిన ఆత్రం దశరథ్ అనే వ్యక్తి బుధవారం ఉదయం పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం ఆత్రం దశరథ్ గత రెండు సంవత్సరాలుగా కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా రోజూ మద్యం కూడా తాగేవాడు. బుధవారం ఉదయం సమయంలో కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించాడు. మధ్యాహ్నం కుటుంబీకులు ఇంటికి తిరిగివచ్చి చూసేసరికి పడిపోయి ఉండడాన్ని గమనించిన కుటుంబీకులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ లో బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






