- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > పొట్టుపొట్టు తిట్టుకున్న జిల్లా, మండల బీజేపీ నాయకులు...ఆడియో వైరల్
పొట్టుపొట్టు తిట్టుకున్న జిల్లా, మండల బీజేపీ నాయకులు...ఆడియో వైరల్
by Bhanu |
నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన బీజేపీ జిల్లా ఉప అధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్ బీజేపీ భైంసా మండల అధ్యక్షురాలు సీరం సుష్మ రెడ్డి ఫోన్ సంభాషణలో ఒకరినొకరు తిట్టుకున్న ఫోన్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

X
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన బీజేపీ జిల్లా ఉప అధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్ బీజేపీ భైంసా మండల అధ్యక్షురాలు సీరం సుష్మ రెడ్డి ఫోన్ సంభాషణలో ఒకరినొకరు తిట్టుకున్న ఫోన్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్టీలో ప్రాధాన్యతపై ఒకరిపై ఒకరు డి అంటే డి గా ఫోన్లో కుమ్ములాడుకున్నారు.ఉపాధ్యక్షుడునీ చెప్పుతో కొడతానని మండల అధ్యక్షురాలు ఫైర్ అవుతూ ఆడియో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.వీరిద్దరూ గొడవపడే ఆడియోను సోషల్ మీడియా వేదికగా విన్న ప్రజలు ఇద్దరి మధ్య అసలు ఏమైంది..! బీజేపీ లో ఏం జరుగుతుంది..! అంటూ చర్చించుకుంటున్నారు.జిల్లా ఉపాధ్యక్షుడు పై మండల అధ్యక్షురాలు గల్లపట్టి చెప్పుతో కొడతానని అనే మాటల యుద్ధం విన్న ప్రజలు ఇద్దరిలో అసలు తప్పే ఎవరిది..! తప్పిదం ఎక్కడ ఎక్కడ జరుగుతుందని ఇది విన్న ప్రజలు గుసగులాడుకుంటున్నారు.
Next Story






