- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముధోల్ ఎస్ఐ గా బిట్ల పెర్సిస్
ముధోల్ మండలంలోని పోలీస్ స్టేషన్ లో కొత్త ఎస్ఐగా బిట్ల పెర్సిస్ గురువారం నుంచి విధులు చేపట్టారు.

దిశ, ముధోల్: ముధోల్ మండలంలోని పోలీస్ స్టేషన్ లో కొత్త ఎస్ఐగా బిట్ల పెర్సిస్ గురువారం నుంచి విధులు చేపట్టారు. గతంలో నిర్మల్ జిల్లా షీటీం, భరోసా కేంద్రంలో ఎస్ఐగా పనిచేసిన బిట్ల పెర్సిస్ ఇటీవల బదిలీపై ముధోల్‌కు వచ్చారు. ఇక్కడ గతంలో విధులు నిర్వహించిన ఎస్ఐ సంజీవ్ మరో పోస్టింగ్‌లో నిర్మల్ జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ బిట్ల పెర్సిస్ మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు విశేష కృషి చేస్తానని తెలిపారు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి అందుబాటులో ఉంటానని, అందులో భాగంగా పోలీస్ స్టేషన్ ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తానని అన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా, నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. తద్వారా ముధోల్ ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆమె తెలిపారు. ఆమెకు సహచర సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు సుస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐకు కొత్త బాధ్యతలు చేపట్టినందుకు పోలీస్ స్టేషన్ సిబ్బంది పూలమాలలతో ఘనంగా స్వాగతం తెలిపారు.






