ఘ‌నంగా మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి జ‌న్మ‌దిన వేడుక‌లు

by Nallavelli.Anjaneyulu |

దిశ, మందమర్రి : తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 68వ జన్మదిన వేడుకలు మంచిర్యాల, మందమర్రి , రామకృష్ణాపూర్ లో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంగా

ఘ‌నంగా మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి జ‌న్మ‌దిన వేడుక‌లు
X

దిశ, మందమర్రి : తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 68వ జన్మదిన వేడుకలు మంచిర్యాల, మందమర్రి , రామకృష్ణాపూర్ లో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంగా మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు బండి సదానందం, సుదమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ముందుగా కేక్ కట్ చేసి కార్యకర్తలు రక్త దానం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఐబీ చౌరస్తా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మందమర్రి లో మంత్రి వివేక్ జన్మదిన సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయంలో మంత్రి వివేక్ పేరు పై అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అలాగే మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షులు రాకo సంతోష్ ఆధ్వర్యంలో మందమర్రి మున్సిపల్ 35 మంది పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్ల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగు ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి చేతుల మీదిగా కార్మికులకు స్వెటర్లు అందజేశారు. రామకృష్ణపూర్ లో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మన్న , అబ్దుల్ అజీజ్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఒడ్నాల శ్రీనివాస్, రాగిడి రాంరెడ్డి, మల్లెతుల నరేష్ యాదవ్, మంద తిరుమల్ రెడ్డి, ఎండీ జమీల్, ఎండీ ఇసాక్, మంతెన భూమయ్య, సొత్కు ఉదయ్, రాయబారపు కిరణ్, జావేద్ ఖాన్, తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధు, రామగిరి అర్జున్, వేల్పుల రమేష్ బాబు, వడ్ల సాయి, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజిని పాల్గొన్నారు.

Next Story