- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి : అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య
దిశ, తాండూర్ : భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి భూ సమస్యలను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. తాండూర్ తహసీల్దార్

దిశ, తాండూర్ : భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి భూ సమస్యలను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. తాండూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా త్వరతగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ జ్యోత్స్న ను ఆదేశించారు. భూ భారతి కింద వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి భూ సమస్యలను వివాదాలకు తావివ్వకుండా పరిష్కరించాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పరిష్కరించాలని, ఆసైన్డ్ భూములకు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హత గల రైతుల జాబితా సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోత్స్న, డిప్యూటీ తహశీల్దార్ కల్పన, సిస్టమ్ ఆపరేటర్ దాసరి మహేష్ పాల్గొన్నారు.






