- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 2 నుండి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు : మంత్రి పొంగులేటి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, జూన్ 2 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులే ,వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, బెజ్జూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, జూన్ 2 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులే ,వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తో కలిసి, ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అద్భుతంగా భూభారతి తెచ్చామని జూన్ 2 నుండి గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగమే పర్యటించి దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు రాష్ట్రంలో6000 మంది సర్వేర్లనుఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సాదా బైనామాలు శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ భూభారతి చట్టం తోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణిని గంగలో తొక్కి భూభారథీ ని తీసుకు వచ్చామని తెలిపారు. భూమి తోనే ప్రజలకు ముడిపడి ఉందన్నారు.. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పోడు రైతులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, సమస్యకు పరిష్కరించాలని కోరారు.ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును వెంటనే పనులనుప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి . నవీన్ మిట్టల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రి, ఎస్పీ శ్రీనివాసరావు, సంయుక్త కలెక్టర్లు డేవిడ్, దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, జిల్లా అధికార యంత్రాంగం, సిర్పూర్నియోజకవర్గంలోని అన్ని మండలాల తాసిల్దారులు, ఎంపీడీవోలు అధికారులు పాల్గొన్నారు.






