- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసా పీఠం ఐదోసారి ఎంఐఎందే..?
బైంసా పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో ఐదోసారి సైతం ఎంఐఎం పార్టీనే పట్టణ పీఠం కైవసం చేసుకుంటుందని ఎంఐఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, భైంసా పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ జాబీర్ హైమ్మద్ పేర్కొన్నారు.

దిశ, బైంసా : బైంసా పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో ఐదోసారి సైతం ఎంఐఎం పార్టీనే పట్టణ పీఠం కైవసం చేసుకుంటుందని, గడిచిన రెండున్నర సంవత్సరాలలో ఎమ్మెల్యే రామారావు పటేల్ కొబ్బరికాయలు కొట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎంఐఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, భైంసా పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ జాబీర్ హైమ్మద్ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ తన కార్యకర్తలకు, టికెట్ ఆశావాహులకు బీఫామ్ ఇవ్వడం లోనే విఫలమవుతున్నాడని, కార్యకర్తలను సంజయించుకోన్న తర్వాతే తనతో పోటీకి రావాలని అన్నారు. డైరెక్ట్ చైర్మన్ ఎలక్షన్స్ ఉంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి తామంటే ఏందో చూపించే వాళ్ళంమని, తాలుకాకి ముగ్గురు ముసలోళ్ళు నారాయణరావు పటేల్, రామారావు పటేల్,విట్టల్ రెడ్డి ఎమ్మెల్యే లుగా వుండి చేసిందేమి లేదని,ఇక కొత్త యువత తాలూకా రాజకీయంకి కావాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ వార్డ్ ఓసి స్థానాలలో సైతం ఎంఐఎం పార్టీ ఎస్సీ మహిళలకు చోటు ఇచ్చిందని, బీజేపీకి ఆ దమ్ముందా అని అన్నారు. ముగ్గురు ఒక్కటైనా ఎంఐఎం పీఠాన్నిధించలేరని, 20 సంవత్సరాలుగా అభివృద్ధి చేసి చూపించింది మేమే అన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడమ బొజ్జు భైంసా మున్సిపల్ పోరులో 25 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అనడం హాస్యాస్పదమని, ఒక్క సీట్ అయినా తెచ్చుకోవాలని ఎద్దేవా వేశారు. ఈ సమావేశంలో ఎంఐఎం నాయకులు ఫైజుల్లా ఖాన్, ఇంతియాజ్ పాల్గొన్నారు.






