బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన త‌రువాత‌నే ఎన్నిక‌ల‌కు వెళ్లాలి : బీసీ జేఏసీ చైర్మన్ రమేష్

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : బీసీలకు ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆసిఫాబాద్

బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన త‌రువాత‌నే ఎన్నిక‌ల‌కు వెళ్లాలి : బీసీ జేఏసీ చైర్మన్ రమేష్
X

దిశ, ఆసిఫాబాద్ : బీసీలకు ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్, బీజేపీ లు బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం ముందు ప్రకటించిన విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని హెచ్చరించారు.

Next Story