- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలే ఇసుక అక్రమ రవాణా.. ప్రశ్నిస్తే బెదిరింపులు
బాసరలో ఇసుకాసురులు అనే శీర్షికన దిశా వార్త పత్రికలో కథనం వచ్చి కాసేపైన కాలేదు ఇంతలో మరో ఇసుక లారీ పట్టపగలే బాసరలో చెక్కర్లు కొట్టింది.

దిశ, బాసర: బాసరలో ఇసుకాసురులు అనే శీర్షికన దిశా వార్త పత్రికలో కథనం వచ్చి కాసేపైన కాలేదు ఇంతలో మరో ఇసుక లారీ పట్టపగలే బాసరలో చెక్కర్లు కొట్టింది. ఇసుక లారీ వద్ద ఉండి స్థానిక సీఐ మల్లేష్కు కాల్ చేయగా వస్తున్నానని చెప్పి లారీ వెళ్ళిపోయే వరకు రాలేదు కదా కనీసం కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంది.. మరోవైపు ఇసుకాసురులను ఏమి చేయలేని సంబంధిత అధికారులు వార్తలు రాసిన సదరు విలేకరుకు ఫోన్ చేసి తాము ఎస్పీ క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పి వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న కథనాన్ని తొలగించవలసిందిగా మాట్లాడారు.
తాము విలేకరులమని అక్రమాలకు పాల్పడుతున్న వారిని వదిలేసి విలేకరులను వార్తలు రాయొద్దని చెప్పడం ఏంటని అడగగా ఇప్పుడు డిలీట్ చేస్తావా చేయవా అని దురుసుగా ప్రవర్తించారు. అసలు ఫోన్ చేసింది పోలీసుల లేక ఇసుక మాఫియా పోలీసులే నిర్ధారించి చెప్పాలి. ఇలా ఉండగా ఈ ఘటన చూసి ఇసుకసురులను ఏ మేరకు కాపాడుతున్నారో ప్రజలకు అర్థమవుతూనే ఉంది. కళ్ళముందు ఇంత జరిగితే ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.






