- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిబుల్ ఐటీ ఫేక్ నోటిఫికేషన్.. గందరగోళంలో విద్యార్థులు
బాసర త్రిబుల్ ఐటీ ఫేక్ నోటిఫికేషన్ గూగుల్ లో చక్కర్లు కొడుతుంది. దాన్ని చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళంలో పడి సతమతమవుతున్నారు.

దిశ, బాసర: బాసర త్రిబుల్ ఐటీ ఫేక్ నోటిఫికేషన్ గూగుల్ లో చక్కర్లు కొడుతుంది. దాన్ని చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళంలో పడి సతమతమవుతున్నారు. దీంతో విద్యార్థుల సంబంధికులు త్రిబుల్ ఐటీ కి సంబంధించిన ఫేక్ నోటిఫికేషన్ తమ పిల్లలకు సోషల్ మీడియా ద్వారా చేరవేయడంతో అసలు నిజం బయటపడింది. దీంతో గూగుల్ లో ఉన్న ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ఫేక్ నోటిఫికేషన్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ ఆలస్యం చేస్తే ఇలాంటి మోసగాళ్ల మాయలో పడి విద్యార్థులు తమ సమాచారాన్ని డబ్బును దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నందున త్వరతగిన నోటిఫికేషన్ విడుదల చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. కాగా ప్రతిఏటా గ్రేడ్ రూపంలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుని కళాశాల యాజమాన్యం ఈసారి మార్కుల రూపంలో వచ్చిన రిజల్ట్స్ కు 0.4 మార్కులను ఏ రకంగా కలపాలో తర్జన భర్జన లో ఒరిజినల్ నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే గూగుల్లో చెక్కర్లు కొడుతున్న త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ బాసరదా లేక వేరే క్యాంపస్ దా అర్థంకాని పరిస్థితి నెలకొంది.






