మ‌ధుక‌ర్ ది ఆత్మ‌హ‌త్య కాదు.. కాంగ్రెస్ నాయ‌కుల హ‌త్య : బండి సంజ‌య్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, వేమ‌న‌ప‌ల్లి : వేమ‌న‌ప‌ల్లి మండ‌ల బీజేపీ ఆధ్య‌క్షుడు మ‌ధుక‌ర్ ది ఆత్మ హ‌త్య కాదు.. కాంగ్రెస్ నాయ‌కుల హ‌త్య అన్నారు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్.

మ‌ధుక‌ర్ ది ఆత్మ‌హ‌త్య కాదు.. కాంగ్రెస్ నాయ‌కుల హ‌త్య : బండి సంజ‌య్
X

దిశ‌, వేమ‌న‌ప‌ల్లి : వేమ‌న‌ప‌ల్లి మండ‌ల బీజేపీ ఆధ్య‌క్షుడు మ‌ధుక‌ర్ ది ఆత్మ హ‌త్య కాదు.. కాంగ్రెస్ నాయ‌కుల హ‌త్య అన్నారు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్. తాజాగా వేమ‌న‌ప‌ల్లి మండ‌ల బీజేపీ అధ్య‌క్షుడు మ‌ధుక‌ర్ సొంత గ్రామం నీల్వాయి కి చేరుకొని కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. రాష్ట్ర బీజేపీ త‌ర‌పున ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు బండి సంజ‌య్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. మధుకర్ మృతికి కార‌కులైనటువంటి వారిని శిక్షించే వరకు బీజేపీ తరఫున పోరాటం చేస్తామని.. దోషులు ఎంతటి వారైనా శిక్ష పడేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు బీజేపీ నేతలను ఆత్మహత్యలు చేసుకునేలా వేధిస్తుంటే.. మనోవేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ నాయకుల హత్య అన్నారు.

"మీరు మా నాయకులని ఎంత వేధిస్తే మీకు అదే గుణపాఠం మేము చెబుతాం" అని రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, కార్యకర్తలు ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. అన్ని రకాలుగా బీజేపీ మీకు అండగా ఉంటుందని, రాజకీయంగా మానసికంగా వేధింపులకు పాల్పడిన ఏట మధుకర్ మృతికి కారకులైన వారిని 48 గంటల్లోగా పోలీసులు అరెస్టు చేయాలని లేకుంటే మరోమారు ఇక్కడికి వచ్చి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. బిజెపి కార్యకర్తలు అంటే ఆత్మహత్యలు చేసుకునే ఎంత పిరికివారు కాదని, ఇక్కడి నాయకులు ఎంతగానో వేధిస్తేనే మధుకర్ మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతటి మారుమూల ప్రాంతంలో కాషాయం జెండా కోసం నికార్సైన బిజెపి కార్యకర్తలు కోల్పోవడం చాలా బాధాకరమని, మృతికి కార్యకులకు శిక్షించే వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు.

Next Story