ఇంటిగ్రేటెడ్ బిఏ-బీఈడీకోర్సులో ప్రవేశాలకు ఆహ్వానం

by Bhanu |

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల సమీకృత కోర్సైన బిఏ-బీఈడీ(BA-B.Ed) కోర్సులో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది.

ఇంటిగ్రేటెడ్ బిఏ-బీఈడీకోర్సులో ప్రవేశాలకు ఆహ్వానం
X

దిశ, లక్షేట్టిపేట : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల సమీకృత కోర్సైన బిఏ-బీఈడీ(BA-B.Ed) కోర్సులో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా. సంతోష్ మహాత్మా శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (NTA – 2025)కు హాజరై ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కళాశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా ప్రిన్సిపాల్‌ను 97032 67391 నంబర్‌లో, ఐటీఏపీ కోఆర్డినేటర్‌ను 99128 52567 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.





Next Story