- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
by Ratna Kumari |
దిశ, లక్షెట్టిపేట : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై ఎస్సై గోపతి సురేష్ అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎవరైనా

X
దిశ, లక్షెట్టిపేట : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై ఎస్సై గోపతి సురేష్ అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు లావాదేవీలు గాని ఇతర పర్సనల్ వివరాలు అడిగితే చెప్పకూడదన్నారు. మనకు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఏదైనా ఓటిపి వచ్చింది చెప్పమన్న ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదన్నారు. మనకు ఏదైనా ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి వాటిని సరిచూసు కోవాలని.. బ్యాంకు వాళ్లు ఎవరు కూడా ఫోన్ మన అకౌంట్ సమాచారాలు అడగరని తెలిపారు. నిత్యం జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావు విద్యార్థులు పోలీసులు పాల్గొన్నారు.
Next Story






