గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆడే గజేందర్

by Kodari Anjali |

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఆడే గజేందర్
X

దిశ, బజార్ హత్నూర్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. అలాగే బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను గజేందర్ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆయన వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Next Story