అడవి అలుగు విక్రయించేందుకు ప్రయత్నం.. ముగ్గురు అరెస్ట్..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా అటవీ క్షేత్రంలో కనిపించే అరుదైన అలుగును విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఇన్ చార్జి అటవీ అధికారి రేవంత్ చంద్ర

అడవి అలుగు విక్రయించేందుకు ప్రయత్నం.. ముగ్గురు అరెస్ట్..!
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా అటవీ క్షేత్రంలో కనిపించే అరుదైన అలుగును విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఇన్ చార్జి అటవీ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. ఆదిలాబాద్ లోని అటవీ కార్యాలయంలో మీడియా కు వివరాలను వెల్లడించారు. గాదిగూడ మండలం అర్జుని గ్రామానికి చెందిన పెందూర్ మహేశ్, కినక శంకర్, పెందూర్ జుగ్నాథ్ లు తమ పొలాల్లో అలుగును పట్టుకుని రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారన్నారు. పక్కా సమాచారంతో వారిని ట్రాప్ చేసి పట్టుకున్నామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. అరుదుగా కనిపించే అలుగుకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి నుంచి వాటిని అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వన్య ప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నాన్ బెయిలేబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. వన్య ప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

Next Story