ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం.. వృద్ధుడి పై గొడ్డ‌లితో దాడి

by Ratna Kumari |

దిశ‌, బెజ్జూర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పెంచిక‌ల్ పేట మండ‌లం ద‌ర్గాప‌ల్లి గ్రామంలో శుక్ర‌వారం సాయంత్రం ఓ వృద్ధుడి

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం.. వృద్ధుడి పై గొడ్డ‌లితో దాడి
X

దిశ‌, బెజ్జూర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పెంచిక‌ల్ పేట మండ‌లం ద‌ర్గాప‌ల్లి గ్రామంలో శుక్ర‌వారం సాయంత్రం ఓ వృద్ధుడి పై గొడ్డ‌లితో దాడి జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. పెంచిక‌ల్ పేట మండ‌ల ప‌రిధిలోని ద‌ర్గాప‌ల్లి గ్రామానికి చెందిన క‌ర్నెబాపు వృద్ధుడి పై అదే గ్రామానికి చెందిన సాద్ గారి ఇస్తారీ గొడ్డ‌లితో దాడి చేసిన‌ట్టు తెలిపారు. దీంతో తీవ్ర గాయాల‌పాలైన క‌ర్నె బాపు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వైద్యం కోసం కాగ‌జ్ న‌గ‌ర్ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మెరుగైన చికిత్స కోసం క‌రీంన‌గ‌ర్ హాస్పిట‌ల్ కి త‌ర‌లించారు. ద‌ర్గా పెళ్లి గ్రామాన్ని పెంచిక‌ల్ పేట ఎస్సై అనిల్ కుమార్ సంద‌ర్శించారు. బాపు పై దాడికి గ‌ల కార‌ణాల‌ను స్థానికుల‌ను అడిగి తెలుసుకున్నారు.

Next Story