- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆత్రం సుగుణ
ఆదిలాబాద్ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థిగా ఆత్రం సుగుణ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థిగా ఆత్రం సుగుణ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో హైదరాబాద్ వెళ్లిన సుగుణ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయనతో పలు అంశాలపై చర్చించిన ఆమెకు సీతక్కతో కలిసి పార్టీ కండువా వేసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేయగా, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆమె బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ ను ఆత్రం సుగుణకు ఖరారు చేయనున్నారు. అందుకు గురువారం లేదా శుక్రవారం ఆమెను పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీఎం ప్రకటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా నేతలు పేర్కొంటున్నారు.






