ఆశావ‌ర్క‌ర్ల‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి

by Ratna Kumari |   (  Updated:2025-10-14 14:13:46  IST  )

దిశ, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని

ఆశావ‌ర్క‌ర్ల‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి : సీఐటీయూ  రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి
X

దిశ, ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని మస్కాపూర్ లోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఆశా వర్కర్ల మహాసభ నిర్వ‌హించారు. తొలుత‌ ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి సీఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు దాదాపు 300 మంది ఆశ వర్కర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆశా వర్కర్ల మహాసభకు తెలంగాణ రాష్ట్ర సీఐటీయూ అధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలీ చాలని జీతాలతో ఆశ వర్కర్లు పని చేస్తున్నారని వారికి తగిన జీతభత్యాలు అందడం లేవని పేర్కొన్నారు. గ్రామాలలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలు అందించడంలో వారే ముందు ఉన్నారని ఆమె తెలిపారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు తగ్గకుండా, ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించి మెరుగైన సేవలను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల తీవ్రమైన వివక్షతను ప్రదర్శిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆశా వర్కర్ల అధ్యక్షురాలు సుజాత, ఖానాపూర్ మండల అధ్యక్షురాలు స్వప్న, కమల, స్వాతి, జిల్లా ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Next Story