గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ చిత్తరంజన్.

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : గంజాయి సాగు, విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. ఆదివారం

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ చిత్తరంజన్.
X

దిశ, ఆసిఫాబాద్ : గంజాయి సాగు, విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. ఆదివారం కెరమెరి మండలంలోని నారాయణ గూడ గ్రామం లోని డ్రోన్ సహాకారంతో రాథోడ్ బాలాజీ పత్తి పంటలో సాగు చేస్తున్న 51 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని అతని పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత నాలుగు నెలలుగా గంజాయి సాగు పెరిగిందని, ఆసిఫాబాద్ 55 కేసుల్లో సుమారు 560 గంజాయి మొక్కలు స్వాధీనం చేసు కున్నామని తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం ఇక పై జిల్లాలోని గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్ సహాకారంతో ప్రత్యేక నిఘా పట్టుకుని గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story