- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రౌడిషీటర్ అరెస్ట్.. ఎస్పీ ఆదేశాలతో రిమాండ్
by Ratna Kumari |
మండలంలో గిర్నూర్ గ్రామానికి చెందిన మేకల దేవేందర్ రౌడీ షీటర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

X
దిశ, బజార్ హత్నూర్ : మండలంలో గిర్నూర్ గ్రామానికి చెందిన మేకల దేవేందర్ రౌడీ షీటర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆదివారం బజార్ హత్నూర్ ఎస్ఐ సంజయ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. పలు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవేందర్ పై ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం.. రిమాండ్ కు పంపినట్టు పేర్కొన్నారు. మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని.. చట్టాన్ని అతిక్రమించే వారిపై రాజీ ఉండదు అని పోలీసులు హెచ్చరించారు.
Next Story






