సైబర్ నేరగాడి అరెస్టు

by Ratna Kumari |

దిశ, ఆసిఫాబాద్ : సైబ‌ర్ నేర‌గాడు అరెస్ట్ అయి సంఘ‌ట‌న కాగ‌జ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ సైబర్ నేరగాడిని అరెస్టు

సైబర్ నేరగాడి అరెస్టు
X

దిశ, ఆసిఫాబాద్ : సైబ‌ర్ నేర‌గాడు అరెస్ట్ అయి సంఘ‌ట‌న కాగ‌జ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ సైబర్ నేరగాడిని అరెస్టు చేసినట్టు కాగజ్ నగర్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఆగ‌స్టు 5, 2025లో ఆన్ లైన్ లో రూ.45,790 సైబర్ మోసానికి గురైనట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డీఫోసీ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారాలతో ట్రేస్ చేయగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాకు చెందిన ఆశిష్ కుమార్ గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్ఐ వెల్ల‌డించారు.

Next Story