- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ అధికారుల వలలో మరో సివిల్ సప్లై అధికారి..!
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. గురువారం రాత్రి పౌర సరఫరాల శాఖ మేనేజర్ నర్సింగరావు

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. గురువారం రాత్రి పౌర సరఫరాల శాఖ మేనేజర్ నర్సింగరావు రూ.75వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. దహేగాంకు చెందిన సందీప్ వాసవి మోడ్రన్ రైస్ మిల్లుకు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మిల్లులో పీడీఎఫ్ బియ్యం గా మార్చి గోదామ్ కి తరలించేందుకు నాణ్యత లోపం ఎన్వోసీ ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నర్సింగరావును రైస్ మిల్లు యజమాని కోరాడు. అయితే రూ.25వేలు చొప్పున మూడు లారీలకు రూ75వేలు మొత్తం లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీనీ ఆశ్రయించాడు. గురువారం రెబ్బెన మంచిర్యాల రోడ్డుపై లంచం తీసుకుంటుండగా వెంబడించి నర్సింగరావుతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించగా.. 16 లారీలకు లంచం తీసుకున్నట్టు తెలిపారు. అధికారులు ఎవ్వరైనా లంచం అడిగితే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని ఆయన కోరారు.






