protest : ఆసుపత్రి ముందు వినూత్న నిరసన

by Sridhar Babu |
protest : ఆసుపత్రి ముందు వినూత్న నిరసన
X

దిశ, కుబీర్ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిలువ ఉన్న వరద నీటిలో యువకులు వరి నాటువేసి వినూత్న నిరసన తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదాన్నిచ్చే విధంగా ఉండాల్సింది పోయి దుర్గంధంతో ముక్కు పట్టుకుని రోగులు ఆసుపత్రికి వచ్చే విధంగా తలపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు ఆసుపత్రి సమస్యలను పరిష్కరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మెడికల్ ఆఫీసర్ వడ్నం వసుంధరకు వినతి పత్రాన్ని అందజేశారు.

Next Story

Most Viewed