- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలు..రంగంలోకి అమిత్ షా
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ముఖ్య నేతలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నది పార్టీ అగ్రనేత జాతీయ నాయకుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నిర్మల్లో ఖరారు చేశారు

దిశ, నిర్మల్ ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురపాలక సంఘాల ఎన్నికల పోరు ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలకు సరిగ్గా ఆరు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో... పురపాలక సంఘాల్లో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కీలకమైన మున్సిపాలిటీలను గెలిపించుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు అగ్రనేతల పర్యటనలను ఓటర్లను చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాయి.
బీజేపీ అగ్రనేతలతో ఎన్నికల ప్లాన్...
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ముఖ్య నేతలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నది పార్టీ అగ్రనేత జాతీయ నాయకుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నిర్మల్లో ఖరారు చేశారు. ఈనెల 8వ తేదీన ఆయన పర్యటన ఖరారు అయ్యిందని, ఇందుకు సంబంధించి స్థల పరిశీలన కూడా చేశారు. అయితే ఆయన పర్యటన లేకపోతే ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు చేసేందుకు బిజెపి ప్లాన్ చేస్తున్నది. మరోవైపు కమలం పార్టీ ఫైర్ బ్రాండ్ కేంద్ర హోంశాఖ డిప్యూటీ మినిస్టర్ బండి సంజయ్ ను నిర్మల్ బైంసా మున్సిపల్ ఎన్నికల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. వీరి పర్యటనల ద్వారా బిజెపికి ఓటు బ్యాంకు పెరుగుతుందని ఆశిస్తున్నారు.
ఎంఐఎం ముఖ్య నేతలు సైతం...
మరోవైపు తెలంగాణలో ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తున్న ఎంఐఎం మున్సిపల్ ఎన్నికల్లో తమ ముఖ్య నేతలను పర్యటించేలా ప్లాన్ చేస్తున్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ బైంసా ఆదిలాబాద్ పురపాలక సంఘాల్లో పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సహా ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులను మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి దింపుతున్నది తాజాగా బుధవారం అసదుద్దీన్ ఓవైసీ సహా పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
చివరలో కాంగ్రెస్ నేతలు...
ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలకు చివరలో కాంగ్రెస్ ముఖ్య నేతలను ప్రచారానికి రప్పిస్తున్నట్లు తెలుస్తున్నది మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన 9వ తేదీన ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు నిర్మల్ మంచిర్యాల ఆదిలాబాద్ ఎక్కడో ఒకచోట బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి లేదంటే జాతీయ నేత ఒకరిని ఉమ్మడి జిల్లాలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.






