- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు అద్భుత ప్రయోజనాలు
దిశ, మందమర్రి : మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం జరిగిన సింగరేణిలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులతో ఎస్ఓటు జిఎం జి.ఎల్.ప్రసాద్, బెల్లంపల్లి ఏరియా ఎస్.ఓ.టు జిఎం కె.

దిశ, మందమర్రి : మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శనివారం జరిగిన సింగరేణిలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులతో ఎస్ఓటు జిఎం జి.ఎల్.ప్రసాద్, బెల్లంపల్లి ఏరియా ఎస్.ఓ.టు జిఎం కె. రాజమల్లు, గోదావరిఖని BCDO బ్రాంచ్ మేనేజర్ ఈ.ఎస్.ఐ కిరణ్ కుమార్ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టర్లను ఉద్దేశించి ఈ.కిరణ్ కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అందించబడే ప్రయోజనాలను వివరించారు. వీటిలో ముఖ్యంగా అనారోగ్య ప్రయోజనం, బీమా బెనిఫిట్స్, ప్రసూతి ప్రయోజనం, వైద్య ప్రయోజనం, సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ ప్రయోజనం, లైఫ్ టైం పెన్షన్ ప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రెటరీ రామకృష్ణాపూర్ అక్బర్ అలీ, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ పీఓ సందీప్, సీనియర్ పీఓ శంకర్, రామ్ నరేష్ (ESI) అన్ని గనుల సంక్షేమ అధికారులు, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు సుదర్శన్, సీ.వీ. రమణ, ఇప్పకాయల లింగయ్య పాల్గొన్నారు.






