- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిమ్స్ వైద్యులపై ఆరోపణలు సరికాదు : డైరెక్టర్ రాథోడ్ జైసింగ్
దిశ, ఆదిలాబాద్ : వైద్యుల నిర్లక్ష్యంతో ఓ గిరిజన మహిళ మృతి చెందినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని,దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని

దిశ, ఆదిలాబాద్ : వైద్యుల నిర్లక్ష్యంతో ఓ గిరిజన మహిళ మృతి చెందినట్లు వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని,దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6న బేల మండలం సదల్పూర్ గ్రామానికి చెందిన మహిళ టేకం పోతుబాయి అనారోగ్యంతో రిమ్స్ లో చేరిందన్నారు.కాగా ఆమెకు 7న సిటీ స్కాన్,11న ఎంఆర్ఐ పరీక్షలు చేశామన్నారు.అదేవిధంగా వ్యాధి నిర్ధారణ కోసం కాంట్రాస్ట్ ఎంఆర్ఐ అవసరమవడంతో.. ఆ ఆరుదైన ఇంజక్షన్ ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో.. హైదరాబాద్ నుంచి తెప్పించి పరీక్షలు చేస్తామని చెప్పిన..వారు వినకుండా ఇంటిబాట పట్టారన్నారు.కానీ రిమ్స్ లో వైద్యం అందడంలేదంటూ కాంగ్రెస్ నేత రూపేష్ రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.తర్వాత వైద్యుల నిర్లక్ష్యంతో ఆ మహిళ మృతి చెందినట్లు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారన్నారు.ఇది పూర్తిగా అవాస్తవని స్పష్టం చేశారు. రిమ్స్ లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు కళ్యాణ్ రెడ్డి, విజయ్ మోహన్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.






