అగ్రో డీలర్ల నిరసన...

by Kodari Anjali |

ఎరువుల కంపెనీలు డీలర్లపై అనవసరమైన ఒత్తిడి తెస్తున్నారని అగ్రో డీలర్లు నిరసన వ్యక్తం చేశారు.

అగ్రో డీలర్ల నిరసన...
X

దిశ, ఆదిలాబాద్: ఎరువుల కంపెనీలు డీలర్లపై అనవసరమైన ఒత్తిడి తెస్తూ, యూరియా, ఎరువులను విక్రయించాలంటే అవసరం లేని ఇతర ఉత్పత్తులను కూడా కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నాయని అగ్రో డీలర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపెల్లి శివప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర అగ్రో డీలర్ల పిలుపు మేరకు సోమవారం ఆదిలాబాద్‌లో డీలర్లు ఒక రోజు దుకాణాలను మూసి కిసాన్ చౌక్‌లో కిసాన్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. వారి నిరసనకు ఆదిలాబాద్ డివిజన్ ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ మద్దతు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు కంపెనీలు డీలర్లపై అదనపు భారం మోపుతున్నాయని, ఒక బస్తాపై రూ.40 నుంచి రూ.50 వరకు అదనపు ఖర్చు పడుతోందని తెలిపారు. సాథీ పోర్టల్ వల్ల రైతులతో పాటు డీలర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సమస్యలు పరిష్కరించకపోతే పూర్తి స్థాయిలో దుకాణాలు మూసివేసి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీలర్లు కత్తూరి ప్రశాంత్, సందేష్, శ్రీనివాస్, బాలాజీ శ్రీను, సంతోష్, క్యాతం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story