ఏజెన్సీ మహిళలే టార్గెట్..!

by Ratna Kumari |

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన అమాయక మహిళలకు మాయ మాటలు చెప్పి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఏజెన్సీ మహిళలే టార్గెట్..!
X

దిశ, అసిఫాబాద్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన అమాయక మహిళలకు మాయ మాటలు చెప్పి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలానికి నుంచి ఇద్దరు మహిళలను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో గురువారం రంగంలో దిగిన పోలీసులు మంచిర్యాల్- మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గత కొంతకాలంగా మహిళల అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. కొంతమంది జిల్లాలో ముఠాగా ఏర్పడి మహిళలకు పెళ్లి, డబ్బు ఉపాధి, పేరిట ఆశ చూపి మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఒక్కోక్క మహిళను సుమారు రెండు నుంచి మూడు లక్షల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇందులో అధికంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన, ఒంటరి, వితంతు మహిళలే లక్ష్యంగా చేసుకొని ముఠా అక్రమ రవాణా చేస్తున్నారు.

వెట్టిచాకిరి.. వ్యభిచార గృహాల్లో

జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న మహిళలను కొందరు దళారులు టార్గెట్ గా చేసుకొని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఆకర్షణమైన రంగు రూపం ఉన్న మహిళలను ఈ ఊబిలోకి దింపుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన ప్రజలు. ప్రధానంగా మహిళలు మానవ అక్రమ రవాణాకు బలవుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన కొందరు పేదరికాన్ని భరించలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వెట్టిచాకరి వ్యభిచారం వైపు వెళ్తున్నారు. ఇదేవిధంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో బాలబాలికలు అదృశ్యం అవుతున్నట్టు సమాచారం. అందులో చాలా మంది ఆచూకీ శాశ్వతంగా ల‌భించ‌డం లేదు. గతంలోనూ ఇలాంటి ముఠాలను జిల్లా పోలీసులు పట్టుకుంటున్నప్ప‌టికీ నిందితులలో ఎలాంటి మార్పులు రావటం లేదు.

గత ఏడాది 9 మంది అరెస్టు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గత ఏడాది అసిఫాబాద్ మండలానికి చెందిన ఇద్దరు మహిళలను పెళ్లి పేరిట ఆసిఫాబాద్ కు చెందిన కొందరు దళారులు మధ్యప్రదేశ్ లోని వ్యభిచార గృహం నిర్వహించే మహిళకు విక్రయించారు. అక్కడ దుర్భర పరిస్థితుల నుంచి తప్పించుకొని వచ్చిన ఓ మహిళా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మానవ అక్రమ రవాణా చేస్తున్న అసిఫాబాద్ చెందిన 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇఃదులో ఓ కానిస్టేబుల్ ఉండటం అప్పట్లో కలకలం సృష్టించింది. మళ్లీ తాజాగా ఇప్పుడు బెజ్జూర్ మండలంలో మానవ అక్రమ రవాణా ఘటనా వెలుగులోకి రావడంతో పోలీసులకు సవాల్ గా మారింది.

Next Story