- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదివాసీలు అభివృద్ధి చెందాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, ఇంద్రవెల్లి : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం మండలంలోని

దిశ, ఇంద్రవెల్లి : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. అంతకు ముందు డప్పు వాయిద్యాలు నడుమ గుస్సాడి నృత్యాలతో స్వాగతం ఎస్పీ కి పలికారు. ఇరు గ్రామ పెద్దలు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు విద్యా, వ్యాపారం, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి చెందాలని సూచించారు. మూఢ నమ్మకాలను విశ్వసించకుండా ఉండాలని, ప్రభుత్వ ప్రైవేటు వైద్యాలను సంప్రదించి వైద్య చికిత్సలు తీసుకోవాలని ఎలాంటి బాబాల మంత్రగాలను నమ్మవద్దని తెలిపారు. అనంతరం ఆదివాసి యువకులతో మమేకమై చాచోయ్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మాడావి ప్రసాద్, ఆదివాసి సమన్వయకర్త చెంచు రామకృష్ణ, ఎస్ఐ సాయన్న, గ్రామ పటేల్ మెస్రం వెంకట్ రావ్, మెస్రం ఆనందరావ్, మెస్రం నాగ్నాథ్, కోట్నాక్ బారిక్ రావ్ కోసరవ్ గ్రామస్థులు పాల్గొన్నారు.






