సీతాఫలాలతోనే ఆదివాసులకు ఆదాయం

by Ratna Kumari |

సీతాఫలాలతోనే ఆదివాసులకు ఆదాయం
X

దిశ గుడిహత్నూర్ : ప్ర‌స్తుతం సీతాఫ‌లాల సీజ‌న్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఇక ఆదివాసులు ఎక్కువ‌గా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో సీతాఫలాల పండ్ల సీజన్ వ‌చ్చిందంటే ఆదివాసులు సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు. ఈ పండ్ల‌తో ఆదివాసీ మహిళలకు ఆదాయం ల‌భిస్తుంది. అటవీ ప్రాంతంలో పొదల మధ్య సహజసిద్ధంగా పెరిగే ఈ పండ్లను సేకరించి స్థానిక మార్కెట్లలో జాతీయ రహది పక్కన కూర్చుని విక్రయిస్తూ మహిళలు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

ఆదాయం రూ.500 నుంచి 700 వ‌ర‌కు

కుటుంబ సమేతంగా ఉదయం లేవ‌గానే అడవులకు వెళ్లి సీతఫలాల చెట్ల నుంచి పండ్ల‌ను సేకరించి వాటిని మార్కెట్ లో, రహదారి ప్రక్కన కూర్చుని పండ్ల‌ను అమ్ముతుంటారు. ఒక్కోక్క‌ పండు రూ.30 నుంచి 60 వ‌ర‌కు అమ్ముతుంటారు. అమ్మకం ద్వారా రోజుకు 500 నుండి 700 వరకు సీతాఫల ఆదాయంతో కుటుంబ అవసరాలు తీరుస్తున్నామంటున్నారు ఆదివాసి మహిళలు. మండలంలోని ధామన్ గూడ, మాన్కపూర్, చింతగూడ ఆదివాసీ మహిళలు, పిల్లలు మండల కేంద్రంలోని మార్కెట్లలో జాతీయ రహదారి పక్కన అమ్ముకుంటూ తమ జీవనాన్ని గడుపుతున్నారు. సీతాఫలాల‌ సీజన్ లో 40 రోజులపాటు సీతాఫలాలను అమ్మకం ద్వారా కొంత ఆదాయాన్ని అర్జిస్తున్నామని పేర్కొంటున్నారు.

ప్ర‌భుత్వం తోడ్పాటు అందించాలి

తమకు వేరే ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడంతో సీతాఫల్ సీజన్ వస్తే సీతాఫలం పండ్లను అమ్మి కొంతవరకు ఆర్థికంగా లాభం కలుగుతుందన్నారు. పంట చేనులో కూలి పనికి వెళ్తే రోజుకు రూపాయలు 200 వస్తుందని.. సీతాఫ‌లం అమ్మితే రోజుకు రూ.500 వ‌ర‌కు వ‌స్తాయి. వర్షాకాలంలో అధిక వర్షాలు పడడంతో రోజు కూలి పనులు దొరక్క కుటుంబ పోషణ భారమైతుంద‌ని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు పండ్లతోటలకు పెంచడానికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తే వాటి ద్వారా జీవన ఉపాధిని పొంది ఆదాయాన్ని ఆర్జించి ఆర్థికంగా ఇంకా ముందుకు సాగుతామ‌ని పేర్కొంటున్నారు.

Next Story